సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే ఇన్ని లాభాలున్నాయా? నీళ్లలో కాస్త ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల చాలా లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉప్పులోని మినరల్స్ చర్మం మీద మచ్చలను తొలగించడంలో సాయపడుతాయి. ఉప్పు నీటితో రోజూ స్నానం చేయడం వల్ల ముడతలు తగ్గి కాంతివంతంగా మారుతుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కీళ్లు, ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ఉప్పు నీటి స్నానం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com