అబ్బాయిలు మీకు కాఫీ అంటే ఇష్టమా? మరి, కాఫీ తాగితే మీ లైంగిక జీవితం ఎలా ఉంటుందో ఆలోచించారా? అయితే, దీని గురించి మీరు ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. కొన్ని పరిశోధనల్లో కీలక విషయాలు తెలిశాయి. కాఫీ తాగే పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని అదే పనిగా తాగితే నష్టపోతారు. రోజూ కేవలం రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగితేనే ప్రయోజనం. మీ పార్టనర్‌తో లైంగికంగా కలిసే ముందు ఒక కప్పు కాపీ తాగితే.. ఎక్కువ సేపు ఆ పని చేయగలరట. ఎందుకంటే.. కాఫీ పురుషాంగంలోని రక్త ప్రసరణను ప్రేరేపిస్తుందట. అందుకే, చురుగ్గా ఉంటుందట. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇది రక్త నాళాలను కాపాడి, రక్త ప్రసరణకు సహాయపడుతుంది. కెఫిన్ పురుషాంగంలోని ధమనులు, మృదువైన కండరాలను సడలించి ఎక్కువ రక్త ప్రవాహానికి అనుమతిస్తుంది. కెఫిన్ తీసుకోవడం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ సలహా తీసుకోండి. కాపీ తాగే మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతుందా? తగ్గుతుందా?