పురుషులతో పోల్చితే మహిళల్లోనే నిద్రలేమి సమస్య ఎక్కువా?

శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం.

కానీ, ప్రపంచ వ్యాప్తంగా నిద్రలేమి సమస్య పెరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పురుషులతో పోల్చితే మహిళలను నిద్రలేమి సమస్య మరింత వేధిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఇంటి పని నుంచి ఉద్యోగం వరకు ఎన్నో పనులు చక్కబెడుతున్న స్త్రీలు సరైన నిద్రలేక బాధపడుతున్నారట.

స్త్రీలలో రుతుక్రమంలో హార్మోన్ల హెచ్చు తగ్గుల కారణంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది.

గర్భిణీలు కూడా హార్మోన్ల మార్పుల కారణంగా నిద్రకు దూరం అవుతున్నారు.

సరైన నిద్ర లేకపోవడం వల్ల మహిళల్లో మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి.

మహిళలు రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com