యాపిల్స్​తో కూడా పచ్చడి పడతారట.. రెసిపీ ఇదే, ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

తాజా, కొంచెం గట్టిగా ఉన్న యాపిల్స్ తీసుకోండి. వాటిని కడిగి.. ఆరబెట్టి చిన్న ముక్కలుగా కోసుకోండి.

Image Source: pexels

కోసిన ఆపిల్ మీద ఉప్పు చల్లి 15 నిమిషాలు ఉంచండి. తరువాత ఆరబెట్టండి.

Image Source: pexels

సోంపు, మెంతులు, పసుపు ఆవాలను కొద్దిగా వేయించి.. బరకగా మిక్సీ చేయండి.

Image Source: pexels

ఆవాల నూనెను వేడి చేయండి. తరువాత ఇంగువ, నల్ల జీలకర్ర, పసుపు వేయండి.

Image Source: pexels

వేడి నూనెలో గ్రైండ్ చేసిన మసాలా దినుసులు, ఎండు మిరపకాయ, యాపిల్ ముక్కలు వేసి కలపండి.

Image Source: pexels

తక్కువ మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి. ఆపిల్ కొంచెం మెత్తబడే వరకు.

Image Source: pexels

రుచిని సమతుల్యం చేయడానికి.. కొంచెం చక్కెర లేదా బెల్లం, 2 టీస్పూన్ల వెనిగర్ కలపండి.

Image Source: pexels

పూర్తిగా చల్లారిన తర్వాత.. పొడి గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి.

Image Source: pexels

దీనిని తయారు చేసిన 24 గంటల తర్వాత పరాటా, పూరీలతో కలిపి తినొచ్చు.

Image Source: pexels