వివిధ రకాల పండ్లను సంవత్సరంలో వివిధ సమయాల్లో తీసుకుంటాము. కొన్ని రకాల ఫుడ్స్, కొన్ని సీజన్స్లో అందుబాటులో ఉంటాయి.
అలాంటివాటిలో ఆపిల్ బేర్ ఒకటి. ఇది చలికాలంలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఇది ఓ రకమైన రేగు పండు. తీపి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది.
బేర్ పోషకమైనది. అయినప్పటికీ.. ఇది అందరికీ మంచిది కాకపోవచ్చు. కొన్ని ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడేవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది.
ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి రేగు పండ్లు తినకూడని లేదా జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
బేర్ లో గణనీయమైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి అధికంగా తీసుకుంటే.. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త వహించేవారికి చక్కెర స్థాయిలను పెంచవచ్చు.
బేర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమయాల్లో జీర్ణ సమస్యలు గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది.
గర్భిణులు రేగు పండ్లను పరిమితంగా తీసుకోవాలని లేదా పూర్తిగా మానుకోవాలని చెప్తారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో జీర్ణక్రియ, జీవక్రియపై దాని ప్రభావాలు అనుకూలంగా ఉండకపోవచ్చు.
కొన్ని సందర్భాల్లో రేగు పండ్లు తినడం వల్ల చర్మంపై దద్దుర్లు లేదా దురద వంటి చర్మ ప్రతిచర్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా అలర్జీలు ఉన్న వ్యక్తులు దూరంగా ఉంటే మంచిది.
మధుమేహం ఉన్నవారు రేగు పండ్లను తినకుండా ఉండాలి. ఎందుకంటే వాటి సహజ చక్కెరలు, అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.