రాధికా మర్చంట్, అనంత్ అంబానీల పెళ్లి హడావుడి మొదలైపోయింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ ఈ జంట కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు మళ్లీ వీరి పెళ్లి హడావుడి మొదలైంది. అంబానీ కోడలిగా రాధికా పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తుంది. జూలైలో అనంత్ అంబానీని ఈ భామ పెళ్లి చేసుకోనుంది. దీనిలో భాగంగా.. పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్, ఫోటోషూట్స్‌కి రాధికా మోడ్రన్ డ్రెస్‌లను ఎంచుకుంటుంది. రాధికా ధరించిన ఈ డ్రెస్‌ను 3డి విధానంలో రూపొందించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3D-carved and sculpted out of Aerospace aluminum technologyతో దీనిని రూపొందించారు. Took 30 artisans to complete this to perfection అంటూ GRACE LING COUTURE ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మరో డ్రెస్ మీద తనకు కాబోయే భర్త అనంత్ అంబానీ రాసిన లవ్ లెటర్‌ను డిజైన్ చేయించింది రాధికా. అనంత్ అంబానీ రాసిన ప్రేమలేఖను.. తన వెడ్డింగ్ గౌన్‌పై డిజైనర్స్ అందంగా డిజైన్ చేశారు. తాజాగా lever_couture రూపొందించిన వైట్ కలర్ గౌన్‌లో మెరిసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రిన్సెన్స్ లుక్‌లో వైట్ కలర్ డ్రెస్‌లో రాధికా చాలా అందంగా కనిపించింది. ప్రసుత్తం రాధికా మోడ్రన్ లుక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ కలెక్షన్లో ఈ భామ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేసింది.