కలబంద.. ఇంట్లో ఏ వాతావరణంలోనైనా పెరిగే అద్భుతమైన మొక్క.

ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

కలబందలోని కూలింగ్ ప్రాపర్టీస్ చర్మాన్ని రక్షిస్తాయి.

కలబంద ఇంకా చాలా రకాలుగా చర్మానికి మేలు చేస్తుంది.

అందుకే, చాలా కాస్మొటిక్స్‌లో కలబందను వాడతారు.

నోటి ఆరోగ్యానికి కూడా కలబంద చాలామంచిది. దంతాలకు సైతం మేలు చేస్తుంది.

జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను సైతం కలబంద దూరం చేస్తుంది.

అలోవెరాలోని యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్.. గాయాలను త్వరగా నయం చేస్తాయి.

జుట్టు పెరగడానికి, చుండ్రు సమస్యను నయం చేయడానికి కూడా అలోవెరా పనిచేస్తుంది.

కలబందలో ఎన్నోరకాల ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. కాబట్టి, జ్యూస్‌గా తీసుకున్నా ఆరోగ్యమే.

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడానికి కూడా కలబంద ఉపయోగపడుతుందట.

నోట్: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. నిపుణుల సూచనల తర్వాతే వీటిని ఆహారంగా లేదా చర్మ సంరక్షణకు ఉపయోగించాలి.