ఆలియా భట్ ఇయర్​రింగ్ కలెక్షన్.. ట్రెడీషనల్ డ్రెస్​లకు భలే నప్పుతాయి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Instagram/ aliaabhatt

ఆక్సీకరణ చెవిపోగులు

ఆలియాకు రంగుల స్పర్శతో కూడిన ఆక్సీకరణ ఆభరణాలపై ఉన్న ప్రేమ, జాతి రకానికి మంత్రముగ్ధులను చేసే ఒక బోహేమియన్ రూపాన్ని ఇస్తుంది.

Image Source: Instagram/ aliaabhatt

హగ్గీ ఇయర్ రింగ్స్

ఈ తరహా హగ్గీ ఇయర్ రింగ్స్ మంచి లుక్స్ ఇస్తాయి. గుండె ఆకారం పోలిన స్టోన్స్​తో కూడిన డిజైన్ ట్రెడీషనల్ డ్రెస్​లకు మంచి లుక్ ఇస్తుంది. ముత్యాల రూపంలో ఉండేవాటిని కూడా మీరు ఎంచుకోవచ్చు.

Image Source: Instagram/ aliaabhatt

స్టడ్స్

చీరల మీదకు స్టడ్స్ భలే నప్పుతాయి. ఇవి మీకు మంచి లుక్​ ఇవ్వడంతో పాటు.. చీరను హైలెట్ చేస్తాయి. మ్యాచింగ్ స్టడ్స్ ఎంచుకుంటే బెస్ట్.

Image Source: Instagram/ aliaabhatt

డ్రాప్ ఇయర్ రింగ్స్

ఫ్యాషన్​గా, అందంగా కనిపించాలనుకుంటే మీరు డ్రాప్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి మీరు ఏమి చేసినా కదులుతూ మంచి వైబ్ ఇస్తాయి.

Image Source: Instagram/ aliaabhatt

ఐ డ్రాప్ ఇయర్ రింగ్స్

ఆలియా పెట్టుకున్న ఐ డ్రాప్ ఇయర్ రింగ్స్ జుంఖాలు ట్రెడీషనల్​గానూ, ట్రెండీగాను కనిపించేలా చేస్తాయి. దీనిని మీరు డ్రెస్​లు, చీరలు, అనార్కలీ ఇలా ఏది వేసుకున్నా బాగా నప్పుతాయి.

Image Source: Instagram/ aliaabhatt

ట్రెడీషనల్ జ్యూవెలరీ

సాంప్రదాయ ఆభరణాల్లో ఉన్న నిండుదనం ఇంక వేటిలో వస్తుంది. మీరు నెక్​పీస్, ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్లతో వచ్చిన సెట్​ని పండుగల సమయంలో వేసుకోవచ్చు.

Image Source: Instagram/ aliaabhatt

స్టెప్ బై స్టెప్ ఇయర్ రింగ్స్

ఈ తరహా ఇయర్ రింగ్స్ సింపుల్​గా, గ్రాండ్​గా కనిపించేలా చేస్తాయి. అందుకే వీటిని ఎక్కువ మంది ఇష్టపడతారు.

Image Source: Instagram/ aliaabhatt

మెటల్ ఇయర్ రింగ్స్

బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ క్లాసిక్ లుక్స్ ఇస్తాయి. అలాగే అన్ని రకాల దుస్తులకు బాగా నప్పుతాయి.

Image Source: Instagram/ aliaabhatt

ట్రెండీ ఇయర్ రింగ్స్

ట్రెడీషనల్ రూపాన్ని రెట్టింపు చేసే.. ట్రెండీ టచ్ కలిగే ఉండే ఇయర్ రింగ్స్ ఎప్పటికీ బెస్ట్​గానే ఉంటాయి.

Image Source: Instagram/ aliaabhatt