వేసవిలో చల్లదనం కోసం ఈ పౌడర్లు వాడుతున్నారా? జాగ్రత్త! వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చల్లదనం ఇచ్చే పౌడర్లకు డిమాండ్ పెరుగుతుంది. చెమట, వాసన, వేడి నుంచి తప్పించుకోడానికి అతిగా పౌడర్లను వాడేస్తుంటారు. అయితే, దానివల్ల మీ చర్మం ప్రమాదంలో పడుతుందనే సంగతి మీకు తెలుసా? పౌడర్ పిండి పదార్థంలా ఉంటుంది. దానివల్ల అది శరీరంపై అట్టలా పేరుకుపోతుంది. దాని వల్ల ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి వెలువడే సహజ నూనెలను పౌడర్ అడ్డుకుంటుంది. దానివల్ల చర్మం పొడిబారుతుంది. శరీరానికి చెమట పట్టడమే మంచిది. పౌడర్ చెమటను అడ్డుకోవడం వల్ల దద్దుర్లు ఏర్పడవచ్చు. టాల్కమ్ పౌడర్లలో ఆస్బెస్టాస్ ఉంటుంది. అది లంగ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. గాలిలో కలిసిన పౌడర్ పీల్చడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. శ్వాస సమస్యలు వస్తాయి.