పాలు తాగినప్పుడు తినకూడని 6 ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

పాలతో లాభాలు

పాలు మన రోజువారీ ఆహారంలో అత్యంత పోషకమైన భాగాలలో ఒకటిగా చెప్తారు. ఇది బలాన్ని ఇస్తుంది. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Source: pexels

పోషకాలతో నిండినది

పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కానీ పాలను తప్పు ఆహారాలతో కలిపి తీసుకోకూడదు.

Image Source: pexels

మంచివి కావు

చాలా మందికి పాలు అన్ని రకాల ఆహారాలతో తీసుకోకూడదని తెలియదు. కొన్ని కలయికలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి.

Image Source: pexels

తినకూడని ఆహారాలు ఇవే

పాలుతో కలిపి ఎప్పుడూ తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ కాంబినేషన్ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని ఎలా చూపుతాయో తెలుసుకుందాం.

Image Source: pexels

సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మ, జామ, ఇతర పుల్లని పండ్లు పాలతో కలిపి తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ తీసుకుంటే అవి కడుపులో గడ్డ కట్టేలా చేస్తాయి. దీని వలన అజీర్ణం, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.

Image Source: Canva

చేపలు

ఆయుర్వేదం ప్రకారం పాలు, చేపలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చర్మంపై మచ్చలు, అలర్జీలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

Image Source: Canva

ఉప్పు

పాలు, ఉప్పు కలిగిన ఆహారాల కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. శరీర జీవక్రియ ప్రక్రియను బలహీనపరుస్తుంది. ఇది భారంగా, అసౌకర్యంగా ఉంటుంది.

Image Source: Canva

పచ్చళ్లు

పాలుతో ఊరగాయ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే పులియబెట్టడం, మసాలా దినుసులు పాలు చల్లదనాన్ని దెబ్బతీస్తాయి.

Image Source: Canva

ఉల్లిపాయ

పాలుతో ఉల్లిపాయలను తీసుకోవడం హానికరం అని చెప్తారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని, విషాలను పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతకు దారితీస్తుంది.

Image Source: Canva

ముల్లంగి

పాలు, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దురద లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాటి వ్యతిరేక లక్షణాలు శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి.

Image Source: Canva