తులా రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18) ఈ వారం తులా రాశివారికి అద్భుతంగా ఉంది. ఆర్థికంగా లాభపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గతవారంలో ఎదుర్కొన్న గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఈ వారం మంచి రోజు. అనవసర ఖర్చులు పెంచుకోవద్దు. Images Credit: Pixabay