మిథున రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18) ఈ వారం మిథున రాశివారికి గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని సంయమనంతో అధిగమించాలి మీ లక్ష్యంపై దృష్టిపెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి మీరు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కొన్ని పనులు పూర్తయ్యేవరకూ వచ్చి ఆగిపోతాయి. వ్యాపారం వృద్ధి చెందాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది..రిస్క్ చేయాలి. ఆదాయం బాగానే ఉంటుంది. తోబుట్టువులతో ఉండే వివాదాలు పరిష్కరించుకుంటారు. ఒంటరిగా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు వారాంతంలో కొంత గందరగోళంగా ఉంటారు. Images Credit: Pixabay