50000 రూపాయల బడ్జెట్‌లో ఈ ల్యాప్‌టాప్‌లను ట్రై చేయవచ్చు
AMD రైజెన్ 5 ప్రాసెసర్, 8 GB DDR4 RAM కలిగి ఉంది. ఇందులోని Radeon RX 6500M GPUకు లేటెస్ట్ రే ట్రేసింగ్ ఫీచర్లు లేవు.
ఇందులో ఉండే 15.6-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లే స్క్రీన్ స్పష్టమైన విజన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ అధిక రిఫ్రెష్ రేట్లు లేదా టాప్-టైర్ కలర్ ఫిడిలిటీ లేదు.
1.99 కిలోల బరువు ఉన్న ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ 3-గంటలు మాత్రమే వస్తుంది. USB-C లేదా Wi-Fi 6 వంటి లేటెస్ట్ ఫీచర్స్ లేవు.
నార్మల్‌గా ఆడే గేమింగ్స్ కోసం MSI Thin A15 బెస్ట్ ఛాయిస్. AMD Ryzen 5 Hexa Core 7535HS (Zen 3+) ప్రాసెసర్, 8 GB DDR5 RAM, 512 GB SSD కలిగి ఉంది.
NVIDIA GeForce RTX 2050 (4 GB GDDR6) కారణంగా కొన్ని లేటెస్ట్ గేమ్స్ కూడా ఆడవచ్చు. 720p వెబ్‌క్యామ్, MS ఆఫీస్ లేకపోవడం నిరాశపరిచే అంశం.
1.86 కిలోల బరువున్న ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల FHD 144 Hz డిస్ప్లే కలిగి ఉంది. Wi-Fi 6E, బ్లూటూత్ 5.3ని కనెక్ట్ చేసుకోవచ్చు.
Intel Core i5 13th Gen 13420H, NVIDIA GeForce RTX 2050 కాంబోతో Acer Aspire 7 వస్తోంది.
దీని 15.6-అంగుళాల FHD డిస్‌ప్లే ఫ్లూయిడ్ మోషన్ కోసం, 8 GB DDR4 RAM ప్లస్ 512 GB SSD మల్టీ టాస్కింగ్ చేస్తుంది.
1.99 కిలోల బరువుతో వస్తుందీ ల్యాప్‌టాప్. ఆన్‌లైన్ ఆటల కోసం Wi-Fi 6, బ్లూటూత్ 5.2 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో MS Office వంటివి లేకపోవడం నిరాశ పరిచే అంశం.
ASUS TUF గేమింగ్ F17 8 GB DDR4 RAM, 512 GB SSDతో ఇంటెల్ కోర్ i5 11వ తరం 11400H ల్యాప్‌టాప్
144 Hz రిఫ్రెష్ రేట్, అడాప్టివ్ సింక్‌తో 17.3-అంగుళాల FHD డిస్‌ప్లే బెస్ట్ క్వాలిటీ.
2.6 కిలోల బరువు కలిగి ఉండే ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2, థండర్‌బోల్ట్ 4, బహుళ USB పోర్ట్‌లు, RGB-బ్యాక్‌లిట్ కీబోర్డ్‌కు కనెక్ట్ అవుతుంది. .