చలికాలంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేసేందుకు చాలామంది మొగ్గుచూపుతారు.

గతంలో వేడినీళ్ల కోసం కట్టెల పొయ్యలు ఉపయోగించి నీరు వేడి చేసేవారు.

ఇప్పుడు గీజర్లు, హీటర్లు వంటివి ఎటువంటి శ్రమలేకుండా వేడినీటిని అందిస్తున్నాయి.

అయితే వేడినీళ్ల కోసం హీటర్లు ఉపయోగిస్తే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

ఎవరూ తిరగని చోట, ముఖ్యంగా కిడ్స్ తిరిగే ప్రాంతాల్లో హీటర్ పెట్టకండి.

కొన్ని హీటర్లకు ఆటో స్విచ్చాఫ్ ఉండదు. దీనివల్ల కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అవుతుంది.

స్విచ్​ ఆఫ్​ చేయకుండా వేడిని తెలుసుకునేందుకు నీటిలో నేరుగా చేయి పెట్టకండి.

హీట్ తట్టుకునే ప్లాస్టిక్ బకెట్స్ ఉపయోగిస్తేనే మంచిది. (Image Source : Pinterest)