మటన్ కీమా - అరకిలో నూనె - నాలుగు స్పూనులు ఉల్లిపాయలు - మూడు పచ్చిమిర్చి - నాలుగు బిర్యానీ ఆకు - ఒకటి యాలకులు - మూడు లవంగాలు - నాలుగు జీలకర్ర - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు స్పూనులు పసుపు - అర స్పూను కారం - రెండు స్పూనులు ధనియాల పొడి - రెండు చెంచాలు టమాటా ప్యూరీ - ఒక కప్పు నిమ్మకాయ రసం - ఒక స్పూను కొత్తి మీర - అర కట్ట జీలకర్ర పొడి - అర చెంచా గరం మసాలా - అర చెంచా
ముందుగా కీమాను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీలైతే కాస్త పసుపేసి కడిగితే మరీ మంచిది.
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి.
ఉల్లిపాయను బాగా తరిగి నూనెలో వేసి వేయించాలి. అవి గా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.
అడుగంటకుండా కలుపూనే ఉండాలి. పచ్చిమిర్చి వేసి వేయించాలి.
ఆ మిశ్రమంలో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి.
కాస్త నీరు వేస్తే అడుగంటకుండా ఉడుకుతుంది. మీకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉంటేనే మంచి సువాసనతో పాటూ ఇగురు కనిపిస్తుంది.
అందులో టమాటా ప్యూరీ కూడా వేసి ఇగురులా ఉడికించాలి.
అందులో కీమా వేయాలి. నిమ్మరసం కూడా చల్లాలి.
అవసరమైతే కాస్త నీళ్లు వేయచ్చు. మీకు వేపుడు కావాలంటే వేయద్దు. ఇగురు కావాలనుకుంటే గ్లాసుడు నీళ్లు పోయచ్చు.