మే 30 సోమవారం నుంచి జూన్ 5 ఆదివారం వరకూ వార ఫలాలు



మేషం
ఈ వారం మేష రాశివారికి బాగానే ఉంది. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగస్తులకు పని వాతావరణం చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపుతారు. ప్రేమ వివాహానికి కుటుంబసభ్యుల అంగీకారం లభిస్తుంది. అనవసర విషయాలపై వాదనపెట్టుకోవద్దు.



వృషభం
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు పెద్ద ఆర్డర్లు పొందే అవకాశాలున్నాయి. ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో కొత్త అనుభూతి ఉంటుంది. మీరు పనిచేసేరంగంలో గొప్ప విజయాలు ఉంటాయి. ఎవరికీ అప్పు ఇవ్వకండి.



మిథునం
ఈ వారం మిథున రాశివారు శుభవార్త వింటారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందగలరు. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారు.వారం చివరిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది. వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు.



కర్కాటకం
ఈ వారం మీరు చాలా డబ్బు ఖర్చుచేస్తారు.బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. చెప్పుడు మాటలు వద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. మీ పని పట్ల ఉన్నతాధికారులు మరియు అధికారులు సంతోషిస్తారు.



సింహం
ఈ వారం విద్యార్థులకు విజయావకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి.



కన్య
ఎప్పటి నుంచో పెండింగ్ లో పడిన పనులు పూర్తి చేస్తారు. యువతకు కెరీర్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. మీరు కొన్ని బాధ్యతలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. బుధ, శుక్రవారాలు శుభప్రదమైన రోజులు.



తుల
ఈ వారం తులారాశి నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. ప్రేమ వ్యవహారాలకు చాలా సమయం ఇస్తారు. వ్యాపారం కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు వ్యాపారంలో లాభపడతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి.



వృశ్చికం
ఈ వారం వృశ్చిక రాశివారు ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన నుంచి ఆనందాన్ని పొందుతారు. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వాయిస్‌ని అదుపులో ఉంచుకోండి.



ధనుస్సు
ఈ వారం మీకు మంచి వారం. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు తయారు చేయొచ్చు. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి మంచి సమయం. ప్రభుత్వ పనులను పూర్తి చేస్తారు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద అవకాశాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు రావొచ్చు.



మకరం
ఈ రాశి వారు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉండే వ్యక్తులకు మంచి రోజు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. కెరీర్ ప్రణాళికలు వేసుకోవచ్చు. అనవసరంగా టెన్షన్ పడొద్దు.



కుంభం
ఈ వారం కుంభ రాశివారి ఆర్థిక స్థితి బావుంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. మీ పని తీరు పట్ల అధికారులు సంతోషిస్తారు.ప్రేమికులు తమ భాగస్వామిని ప్రపోజ్ చేస్తారు. అతిగా ఆలోచించవద్దు.



మీనం
ఈ వారం మీఆదాయం పెరుగుతుంది. లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అనవసర మాటలు, ప్రసంగాలు వద్దు. ఎవరినీ బాధపెట్టవద్దు. మీ అనుభవాలను ఇతరులు ఉపయోగించుకుంటారు. ప్రయాణ సమయంలో సహ ప్రయాణీకులతో ఎక్కువగా మాట్లాడకండి. ఖర్చులు పెరుగుతాయి. కోపం మరింత తీవ్రమవుతుంది.