కార్తీకస్నానం - నెలరోజుల ఆరోగ్య నియమం! సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెలరోజులూ ఈ నియమం పెట్టారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం స్నానమాచరించడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. చంద్ర కిరణాలతో ఔషధలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆధ్యాత్మికం, దేవుడు పేరు చెప్పి నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెలరోజులు చల్లటి నీటిలో స్నానమాచరించినా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే.. Images Credit: Pinterest