టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటకు చెప్పినప్పటి నుంచి వరుస ఫొటోలను షేర్ చేషుతుంది కాజల్. నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తోంది. ఇప్పుడు మెటర్నటీ ఫొటోషూట్ లో పాల్గొంది కాజల్. దీనికి సంబంధించిన ఓ ఫొటోను, వీడియోను అభిమానులతో పంచుకుంది. పింక్ కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో కాజల్ ఎంతో అందంగా కనిపిస్తుంది. మదర్ హుడ్ కోసం సిద్ధమవుతున్నానని.. అదొక అందమైన జర్నీ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలపై సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతూ.. కాజల్ ను పొగిడేస్తున్నారు. కాజల్ మెటర్నిటీ ఫొటోషూట్