చందమామ కాజల్ అగర్వాల్ కు పెళ్లి రెండేళ్లు అయ్యింది. గౌతమ్ కిచ్లూ, కాజల్ అక్టోబర్ 30, 2020లో ఏడడుగులు వేశారు. ఈ ఏడాది పెళ్లి రోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? పెళ్లి రోజు, అందులోనూ ఆదివారం! చెల్లెలు నిషా అగర్వాల్ ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు కాజల్. కుమారుడు నీల్, భర్త గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్... పెళ్లి రోజున దిగిన ఫోటో చెల్లెలు నిషా, ఆమె కుమారుడు ఇషాన్, కాజల్... ఫోటో చూస్తే అబ్బాయికి దిష్టి తగలకూడదని కాజల్ లవ్ ఎమోజి పెట్టారు. లాక్‌డౌన్‌లో కాజల్ పెళ్లైంది. ఆ వెంటనే పిల్లాడు పుట్టాడు. రెండేళ్లలో ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యారు. పెళ్ళికి ముందు... పెళ్లి రోజు మేకప్ అవుతున్న కాజల్ ఫోటో పెళ్ళైన తర్వాత రెండేళ్లు కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్న కాజల్, ఇప్పుడు కమల్ 'భారతీయుడు 2' చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలు (All Images Courtesy : Kajal, Nisha, Gautam / Instagram)