ఈఫిల్ టవర్ ముందు అషూ రెడ్డి అషూ రెడ్డి దేశాలు తిరుగుతూ చాలా బిజీ అయిపోయింది. ఏ పనిమీద వెళుతోందో తెలియదు కానీ మొన్నటి వరకు అమెరికా,ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్లింది. ఈఫిల్ టవర్ ముందు నిల్చుని ఫోజులు కొడుతోంది ఈ బిగ్ బాస్ భామ. ఈఫిల్ టవర్ అందంతో పోటీ పడుతూ శరీరాన్ని విల్లులా వంచుతూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్ స్టా పోస్టు చేసింది. దీంతో అభిమానులు కామంట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రావెల్ డైరీస్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది అషూ రెడ్డి. (All Images Credit: Ashu reddy/Instagram)