ఏనుగుకు స్నానం చేయించిన అదా శర్మ - వామ్మో, ధైర్యం ఎక్కువే! గ్లామర్ ప్రపంచంలో ఆదా శర్మను మించిన ఆల్‌రౌండర్ ఎవరూ లేరు. నటన నుంచి డ్యాన్స్, యుద్ధ విన్యాసాల వరకు ఏదైనా ఈజీగా చేసేస్తుంది. ఎప్పుడూ ఫన్నీగా ఏదో ఒక చిలిపి పనులు చేస్తూ ఫ్యాన్స్‌ను నవ్విస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆదా శర్మ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. అన్ని రంగాల్లో ముందు ఉండాలనే లక్ష్యంతో ఆదా ఎప్పుడూ కొత్తవి నేర్చుకుంటూనే ఉంటుంది. అందం, అభినయం, ప్రతిభా అన్నీ ఉన్నా ఆదాకు సక్సెస్ దరిచేరడం లేదు. ఇందుకు కారణం, ఆమె మరీ క్యూట్‌గా ఉండటం కూడా. కానీ, ఆదా అవేవీ పెద్దగా పట్టించుకోదు, పాజిటీవ్‌గా తనపని తాను చేసుకుపోతుంది. తాజాగా ఆదా ఏనుగుకు స్నానం చేయిస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి, అమ్మో.. ఆదా నీకు ధైర్యం ఎక్కువే అంటున్నారు ఫ్యాన్స్. Images and Videos Credit: Adha Sharma/Instagram