అరగంట పాటూ డ్యాన్స్ చేయండి చాలు



శరీరానికి వ్యాయామం అనగానే రన్నింగ్, వాకింగ్, జాగింగ్ అనుకుంటారు, కానీ డ్యాన్స్ చేసినా చాలు.



డ్యాన్స్ రాకపోయినా ఒక పాట పెట్టుకుని నచ్చినట్టు డ్యాన్స్ చేయండి. శరీరానికి మంచి వ్యాయామంలా అవుతుంది.



అరగంట పాటూ నచ్చినట్టు డ్యాన్స్ చేస్తే శరీరం మొత్తానికి వ్యాయామం చేసినట్టు అవుతుంది.



రన్నింగ్, వాకింగ్ వంటివి చేయడం వల్ల శరీరానికే వ్యాయామం చేసినట్టు అవుతుంది. డ్యాన్స్ చేస్తే మెదడు, శరీరం కూడా సమన్వయంతో పనిచేస్తాయి.



రోజూ అరగంట పాటూ డ్యాన్స్ చేస్తే బరువు త్వరగా తగ్గుతారు.



రోజూ డ్యాన్స్ చేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. విషయాలను మర్చిపోకుండా ఉంటారు.



ఒత్తిడి తగ్గించుకోవడానికి డ్యాన్స్ ఉపయోగపడుతుంది.



ప్రతి రోజూ ఉదయం డ్యాన్స్ చేయడం వల్ల మంచి మార్పులు శరీరంలో జరుగుతాయి.