జులై నెలలో మీ రాశి ఫలితం



మేషం
ఈ నెలలో జన్మంలో కుజుడు, రాహువు ప్రభావం వల్ల అందరితోనూ విరోధాలుంటాయి. మంచికి వెళితే చెడు ఎదురవుతుంది. వాహన ప్రమాదం ఉంటుంది జాగ్రత్తపడండి. సోదరులతో గొడవలు జరుగుతాయి. ఏ పని చేపట్టినా పూర్తిచేయలేరు. భూ సంబంధ వ్యవహారాల్లో నష్టాలుంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. ప



వృషభం
ఈ నెలలో గ్రహసంచారం అన్నివిధాలుగా బావుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత ఆందోళన ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.



మిథునం
మిథున రాశివారికి ఈనెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన కొన్ని పనుల్లో సక్సెస్ అయితే మరికొన్ని పనుల్లో అపజయం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్ప మరే ఇతర ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కొన్ని సమస్యలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త



కర్కాటకం
ఉద్యోగులు, వ్యాపారులు, మీ వృత్తుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు మనశ్శాంతి ఉండదు. అనారోగ్య సమస్యలుంటాయి. అశాంతిగా ఉంటారు, గొడవలు పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిందే. కుటుంబంలోనూ పెద్దగా సంతోషం ఉండదు.



సింహం
ఈ నెలలో మొదటి 15 రోజులు అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. నెలలో ద్వితీయార్థం మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉండవు.. ప్రతివిషయంలోనూ వ్యతిరేకత ఎదురవుతుంది.



కన్య
ఈ నెలలో అష్టమ కుజుడు ప్రభావం మీపై చాలా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త పడండి. ఉద్యోగులకు స్థానమార్పులు ఉండొచ్చు. ఇల్లు మారే అవకాశాలున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో నష్టపోతారు. నమ్మినవారే మోసం చేస్తారు. చేసే వృత్తి వ్యాపారాలు మాత్రం బాగానే సాగుతాయి.



తులా
జులై నెల అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అన్నీ శుభఫలితాలే. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనుంది. ఆరోగ్యం బావుంటుంది, రాని బాకీలు వసూలవుతాయి. ధైర్యంగా ముందుకు అడుగేయండి. కుజుడి సంచారం కారణంగా కోపం అధికంగా ఉంటుంది.



వృశ్చికం
ప్రధమార్థంలో అష్టమంలో గ్రహసంచారం కారణంగా అనుకూలత తక్కువగా ఉంటుంది. తొందరగా అలసిపోతారు. అకాల భోజనాలు చేస్తారు.గడిచిన నెలలతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి.



ధనస్సు
జులై నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు , వ్యాపారాలు బాగా సాగుతాయి. గడిచిన నెలలతో పోలిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొత్త ప్రణాళికలు రచిస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కోపం తగ్గించుకోండి.



మకరం
ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూల సమయమే. అయితే నాలుగో స్థానంలో ఉన్న కుజుడు, రాహువు కారణంగా ఎలాంటి కారణం లేకుండా విరోధాలు జరుగుతాయి. కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు. నిందలు పడతారు. కుటుంబంలో భార్య-భర్త మధ్య అవగాహన ఉండదు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది



కుంభం
ఈ నెలంతా మీకు చాలా బావుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి అనుకూల సమయం. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. మీ మాటతీరుతో ఎలాంటి వారినైనా కట్టిపడేస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమయం.



మీనం
గడిచిన నెలలతో పోలిస్తే జులై నెల అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. చాలా సమస్యలు ఓ కొలిక్కి రావడంతో ఉత్సాహంగా ఉంటారు. బంధువులు, స్నేహితుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. శత్రువులపై మీదే పై చేయి. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.