యాంకర్ సుమకున్న వ్యాధి ఇదే

యాంకర్ సుమ తెలుగు వారందరకీ పరిచయమే. ఆమెకు ఒక వింత ఆరోగ్య సమస్య ఉంది.

తాను ‘కీలాయిడ్ టెండెన్సీ’ అనే చర్మ వ్యాధితో బాధపడుతోంది.

చర్మానికి గాయం తగిలినప్పుడు ఆ గాయాన్ని సరిచేయడానికి ఫైబరస్ కణజాలం ఆ ప్రదేశంలో ఏర్పడుతుంది.

కీలాయిడ్స్ సమస్య ఉన్న వారిలో గాయం పక్క కణాలకు కూడా సోకుతూ పెరిగిపోతుంది.

అసలు గాయం కన్నా కీలాయిడ్స్ గా పిలిచే కణజాలం అధికంగా పెరిగి ఉబినట్టు అవుతుంది.

ఇవి సాధారణంగా ఛాతీ, భుజాలు, చెవులు, చెంపలపై వస్తాయి.

ఇవి ఆరోగ్యానికి హానికరం కావు కాని చికాకును కలిగిస్తాయి.

చాలా కాలంగా సుమ ఈ వ్యాధితోనే బాధపడుతోంది.