‘జబర్దస్త్’లో రాకింగ్ రాకేష్ గురించి మీకు తెలిసే ఉంటుంది. పిల్లలతో స్కిట్లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమంతో సుజాత పరిచయమైంది. ఆ తర్వాత ‘జోర్దార్’ కార్యక్రమంతో ‘జోర్దార్’ సుజాతగా గుర్తింపు పొందింది. అనంతరం ఆమె ‘బిగ్ బాస్’లో ఛాన్స్ కొట్టేసింది. ‘బిగ్ బాస్’ నుంచి వచ్చిన తర్వాత ఆమెకు రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇటీవల వీరిద్దరూ ‘జబర్దస్త్’లో స్కీట్స్ చేస్తున్నారు. దీంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది. చాలామంది ప్రేక్షకులు వీరిది ‘మల్లెమాల’ అల్లిన ప్రేమ అని సందేహిస్తున్నారు. తాజాగా ఓ స్కిట్‌లో తమ ప్రేమ నిజమైనదని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని ప్రకటించారు. ఈ జంట ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జంట గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CdGcJgmp3VV/?utm_source=ig_web_copy_link