పనీర్ చేయాల్సిన పద్ధతి ఇది

పనీర్ చాలా మందికి ఇష్టమైన వంటకం. దీనితో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు.

పనీర్‌ను ఇంట్లోనే పర్‌ఫెక్ట్‌గా చేసుకోవచ్చు.

లీటర్ పాలను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పావు గంట సేపు మరిగాక అందులో రెండు స్లూన్ల నిమ్మరసం వేసి పాలను విరగొట్టాలి.

విరిగిన పాలను ఒక వస్త్రంలో వడకట్టాలి. నీరు అంతా పోయి, వస్త్రంలో పాలు విరిగిన మిశ్రమం మిగిలిపోతుంది.

పాల మిశ్రమాన్ని వస్త్రంతోనే మూటలా కట్టి ఆ మూటను ఒక పీటపై పెట్టి బాగా బరువుగా ఉండే వస్తువును ఆ మూటపై పెట్టాలి.

దాదాపు రెండు మూడు గంటల పాటూ అలా ఉంచేయాలి. ఇలా చేస్తే పాల మిశ్రమంలో ఉన్న కొద్ది పాటి నీరు కూడా పోయి పనీర్ చక్కగా తయారవుతుంది.

తరువాత దాన్ని తీసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఓ మూడు గంటల పాటూ డీప్ ఫ్రిజ్ లో పెడితే గట్టి పడి మార్కెట్లో దొరికే పనీర్ లా అవుతుంది.

పన్నీర్‌ను వారానికి రెండు సార్లు తింటే చాలా మంచిది.