మీరు ITR ఫైల్ చేయడానికి సిద్ధం అవుతుంటే, ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి.

AIS - ఫామ్‌ 26AS మధ్య తేడా తెలుసుకోవాలి. దీనివల్ల మీ పని మరింత ఈజీగా మారుతుంది.

IT డిపార్ట్‌మెంట్, 2021లో, కంప్లైయెన్స్ పోర్టల్‌లో యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను (AIS) ప్రారంభించింది.

టాక్స్‌ పేయర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఒకవేళ మర్చిపోయినా ఈ స్టేట్‌మెంట్‌ గుర్తు చేస్తుంది.

టాక్స్‌ రిఫండ్‌, TDS లేదా TCS, పెట్టుబడులపై వచ్చిన వడ్డీ, MF లావాదేవీలు, పన్ను చెల్లింపులు, షేర్ లావాదేవీల సమాచారం ఉంటుంది.

మీ ITR ఫైలింగ్‌ టైమ్‌లో AISను పక్కన పెట్టుకుంటే, ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ మిస్‌ కాదు. AIS డేటాను PDF, JSON, CSV ఫార్మాట్లలో యాక్సెస్ చేయవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో పన్ను మినహాయింపు, వసూళ్లు, పాన్ గురించిన పూర్తి సమాచారం ఉంది. ITR ఫైల్ చేసేటప్పుడు, 26AS ఫారం, పాన్‌తో పాటు ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల వివరాలు పన్ను చెల్లింపుదారు దగ్గర ఉండాలి.

ఫామ్‌ 26ASలో, TDS, సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్, అడ్వాన్స్‌ టాక్స్‌, టాక్స్‌ రిఫండ్‌, యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌, హై వాల్యూ ట్రాన్జాక్షన్లు, టాక్స్‌ డిడక్షన్‌ వంటి సమాచారం ఉంటుంది.

https://www.incometax.gov.in/iec/foportal/ లో మీ యూజర్‌ ఐడీ (పాన్‌ నంబర్‌), పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్ కావాలి. ఆ తర్వాత, మెనూలో కనిపించే AIS మీద క్లిక్‌ చేయండి.

https://www.incometax.gov.in/iec/foportal/ లోకి లాగిన్ అవ్వండి. ఈ-ఫైల్ మీదకు కర్సర్‌ తీసుకెళ్లగానే డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఎంచుకోండి. అందులో 'వ్యూ ఫారం 26AS'పై క్లిక్ చేయండి.