మీ క్రెడిట్ స్కోర్ 100 పాయింట్ల వరకు పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి క్రెడిట్ కార్డు బిల్లును గానీ, లోన్ EMIను గానీ లాస్ట్ డేట్ రాకముందే చెల్లించండి ఎక్కువ లోన్లు వద్దు. అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్‌లు తీసుకోవద్దు సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ Loans ను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుని ఇచ్చే హోమ్ లోన్స్, కార్ లోన్స్- సెక్యూర్డ్ లోన్స్ తనఖా ఏమీ లేకుండా ఇచ్చే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్- అన్ సెక్యూర్డ్ లోన్స్ క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్ మొత్తాన్నీ వాడొద్దు. కార్డు లిమిట్‌లో సగం వరకు మాత్రమే ఉపయోగించడం బెటర్ మీరు చెల్లించే EMIల మొత్తం జీతం లేదా మొత్తం ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోవాలి లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. అలా చేస్తే మీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది క్రెడిట్ రిపోర్ట్‌ను 3-4 నెలలకు ఒకసారైనా చెక్ చేసుకోండి. ఏదైనా తప్పు కనిపిస్తే, కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కరెక్ట్ చేయించాలి