బిట్‌కాయిన్ 4.21 శాతం పెరిగి రూ.24.70 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 5.29 శాతం పెరిగి రూ.1,56,436 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.07 శాతం తగ్గి రూ.81.91, బైనాన్స్ కాయిన్ 1.97 శాతం పెరిగి రూ.20,743, రిపుల్ 2.71 శాతం పెరిగి రూ.41.74, యూఎస్‌డీ కాయిన్ 0.15 శాతం తగ్గి రూ.81.91, లిడో స్టేక్డ్ ఈథర్ 5.56 శాతం పెరిగి రూ.156,442, డోజీ కాయిన్ 0.24 శాతం పెరిగి రూ.5.62 వద్ద కొనసాగుతున్నాయి. పెపె, బ్లాక్స్, ఫెచ్ ఏఐ, కాన్‌ప్లక్స్, స్టేక్స్, వైబింగ్, ఆర్డీ లాభపడ్డాయి. యుటిలిటీ వెబ్, సైబర్ హార్పర్, రిబ్బన్ ఫైనాన్స్, సేఫ్ పాల్, రెండర్, ఫ్లెక్స్ కాయిన్, ఫ్లేర్ నష్టపోయాయి.