ఐటీ పోర్టల్లో పేరు నమోదు చేసుకొనే ప్రక్రియ

ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ https://www.incometax.gov.in/iec/foportalను ఓపెన్‌ చేయండి.

'రిజిస్టర్‌'పై క్లిక్‌ చేసి 'టాక్స్‌ పేయర్‌' ఆప్షన్‌ ఎంచుకోండి.

ఇప్పుడు మీ పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయండి. ఆ పక్కనే వ్యాలిడేట్‌ బటన్‌ కొట్టి కంటిన్యూపై క్లిక్‌ చేయండి.

మీ ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, కాంటాక్టు వివరాలు ఇవ్వండి.

ఫామ్‌ నింపడం పూర్తయ్యాక మీ వివరాలను ఒకసారి తనిఖీ చేసుకొని కంటిన్యూపై క్లిక్‌ చేయండి.

మీ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది. వాటిని ఎంటర్‌ చేయండి.

ఆ తర్వాత మీ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ సెటప్‌ చేసుకోవాలి.

చివరికి మీ నమోదు ప్రక్రియ విజయవంతమైందని సందేశం వస్తుంది.

ఆ తర్వాత మీ అకౌంట్లో లాగిన్‌ అయ్యి ఐటీఆర్‌ సమర్పించొచ్చు. టాక్సబుల్‌ ఇన్‌కమ్‌, డిడక్షన్స్‌ వంటివి గణించొచ్చు.