అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించిన దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. గేమ్ లో పెద్దగా తన మార్క్ ను క్రియేట్ చేయలేకపోయినా.. తన అందంతో మంచి క్రేజ్ దక్కించుకుంది. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం అవకాశాన్ని దక్కించుకుంది. రీసెంట్ గా ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓ పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ లు అంటూబిజీగా గడుపుతుంది. ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలపై హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. ట్రెడిషనల్, వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ రెండిటిలో నువ్ చాలా అందంగా ఉన్నావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.