బొల్లి రోగం వారసత్వంగా వస్తుందా?



బొల్లి మచ్చలు ఒక చర్మరోగం. ఇది ఎంతో మందిలో కనిపిస్తుంది. సాధారణ చర్మానికి భిన్నంగా బొల్లి మచ్చలు చాలా తెలుపుగా ఉంటాయి.



మెలనిన్ అనేది చర్మం, జుట్టు, కళ్ళకు రంగును ఇచ్చే హార్మోను.



మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే కణాలైన మెలనోసైట్లు నాశనమైనప్పుడు సంభవించే దీర్ఘకాలిక చర్మ రుగ్మత బొల్లి.



మెలనోసైట్ కణాలు నాశనం అయిన ప్రాంతాల్లో తెల్లటి పాచెస్ ఏర్పడతాయి. అదే బొల్లి మచ్చలు.



బొల్లి మచ్చలు జుట్టును ప్రభావితం చేస్తాయి. ఆ ప్రాంతంలోని జుట్టు తెల్లగా లేదా బూడిద రంగులోకి మారతాయి.



బొల్లి రోగం ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పలేము. ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.



కొన్ని సందర్భాల్లో, థైరాయిడ్ వ్యాధి లేదా టైప్ 1 మధుమేహం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బొల్లి సంబంధం కలిగి ఉంటుంది.



నిజం చెప్పాలంటే బొల్లికి ఎటువంటి చికిత్స లేదు. వచ్చిందంటే అలా జీవితాంతంత కొనసాగాల్సిందే.