‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మోనల్ గజ్జర్.

ఆమె తొలి సినిమా హిట్టయినా, ఆమెకు మాత్రం లక్ కలిసి రాలేదు.

దుకాణం సర్దేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ‘బిగ్‌బాస్’ సీజన్-4లో అవకాశం వచ్చింది.

‘బిగ్ బాస్‌’లో మోనల్‌.. అఖిల్‌తో జతకట్టింది. వారి స్నేహం బయట కూడా కొనసాగింది.

ఇద్దరు కలిసి ఒక వెబ్ సీరిస్‌కు కూడా సైన్ చేశారు. కానీ, అది ఆగిపోయినట్లు తెలిసింది.

ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యహరించిన తర్వాత మోనల్ గుజరాత్‌కు వెళ్లిపోయింది.

అఖిల్, మోనల్ ఇప్పుడు కలుసుకోవడం లేదని టాక్. దీంతో బ్రేకప్ రూమర్స్ వస్తున్నాయి.

అఖిల్ ఇటీవల ఇన్‌స్టా లైవ్‌లో రిలేషన్‌షిప్ గురించి ఓ ఫ్యాన్‌కు చెప్పిన జవావే ఇందుకు నిదర్శనం.

తాను ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో లేనని, బ్రేకప్ అయ్యిందని చెప్పాడు.

దీంతో అఖిల్, మోనల్‌కు మధ్య బ్రేకప్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

మరి దీనిపై మోనల్ ఏమంటుందో చూడాలి. అయితే, వీరు ప్రేమలో ఉన్నట్లు ఏ రోజూ చెప్పలేదు.

Images and Videos Credit: Akhil and Monal/Instagram