ఉపవాసం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్యం కోసం చక్కటి ఆహారంతో పాటు ఉపవాసం ఎంతో మంచిది అంటారు పెద్దలు. ఆరోగ్యంతో పాటు బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది ఉపవాసం చేస్తుంటారు. సాధారణంగా 10 నుంచి 12 గంటల వరకు ఉపవాసం చేయడం హెల్త్ కు మంచిదని భావిస్తారు. ఉపవాసంతో బీపీ, కొలెస్ట్రాల్ తగ్గి, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఉపవాసం మంచిదే అయినా, ఎక్కువగంటలు చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వారానికి ఒకటి, రెండుసార్ల ఉపవాసంతో కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మెటబాలిజం సరిగ్గా ఉంటుందట. బరువు తగ్గడం కోసం ఉపవాసాలు చేయడం కంటే సమతుల ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు. డయాబెటిస్ లాంటి సమస్యలతో బాధపడే వారు తరచుగా ఉపవాసం చేయడం మంచిది కాదంటున్నారు. All Photos Credit: pexels.com