ఆలూ చిప్స్ తింటున్నారా? ఈ రోగాలకు స్వాగతం చెప్పినట్టే... స్నాక్స్ అనగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి తిండి పదార్థం ఆలూచిప్స్. అవెంత అనారోగ్యకరమో తెలుసా? దీర్ఘకాలంలో ఎంతగా ప్రభావం చూపిస్తున్నాయో తెలిస్తే షాకవ్వడం ఖాయం. కొన్ని పరిశోధనలలో ఆలూ చిప్స్ కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రోజూ తింటే సులువుగా బరువు పెరుగుతారు. చిప్స్ ప్యాకెట్ పట్టుకున్నాక నియంత్రణ లేకుండా తింటున్నారంటే అవి మిమ్మల్ని అప్పటికే బానిస చేసుకున్నట్టే. చిప్స్ తరచూ తినే వారిలో అధిక రక్తపోటు త్వరగా వస్తుంది. చిప్స్ అధిక ప్రాసెస్ చేసిన ఆహారం. వీటితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. చిప్స్‌లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. తింటే దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని అధికంగా తినేవారిలో మానసిక ఆందోళన వచ్చే అవకాశం ఉంది. మహిళలు ఏళ్లకుఏళ్లు తింటుంటే పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం కష్టమవుతుంది.