ఇంట్లోకి గుడ్లగూబ వచ్చిందా..అయితే డబ్బే డబ్బు..



గుడ్లగూబ'ను చాలామంది అశుభానికి ప్రతీకగా భావిస్తారు. గుడ్లగూబ కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు.
శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభ శకునం మరొకటి లేదని చెబుతోంది.



లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని, ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహిస్తుందని అంటారు.



'ఉల్లూక తంత్రం'లో గుడ్లగూబ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు.



తెల్లవారుజామున గుడ్లగూబ ఎవరింటిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట



ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది



గర్భవతిని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం కలుగుతుందట.



గుడ్లగూబ ఇంటి ఆవరణలో, పశువులశాలలో, పొలంలో చెట్లపై నివాసం ఉంటే ఆ యజమానికి పాడిపంటలకు ... సుఖసంతోషాలకు కొదువ ఉండదట.



ఎన్ని చెప్పుకున్నా ఇప్పటికీ గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తున్న వారు ఎందరో..