బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఆదివారం ఎపిసోడ్ తో ముగియనుంది. టాప్ 5లో ఉన్న సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, సిరి, మానస్ లలో విజేతగా ఎవరు గెలుస్తారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. 



బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి చాలా మంది గెస్ట్ లు రాబోతున్నారు.



ముందుగా రణవీర్, దీపికా కలిసి రాబోతున్నారని తెలుస్తోంది. 83 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ జంట బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతుంది. 



'83'లో కీలకపాత్ర పోషించిన నటుడు జీవా కూడా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. 



ఇక 'ఆర్ఆర్ఆర్'ని ప్రమోట్ చేసుకోవడానికి రాజమౌళి, అలియాభట్, రామ్ చరణ్ రాబోతున్నారు. 



నిజానికి ఇప్పటికే రామ్ చరణ్ ఓసారి బిగ్ బాస్ సీజన్ 5 స్టేజ్ పై కనిపించారు. ఇప్పుడు మరోసారి వస్తున్నారు.



ఎన్టీఆర్ మాత్రం ఈ షోని మిస్ చేసినట్లు తెలుస్తోంది.



'శ్యామ్ సింగరాయ్'ని ప్రమోట్ చేసుకోవడానికి హీరో నాని కూడా రాబోతున్నారు. 



ఆయనతో పాటు హీరోయిన్లుగా నటించిన సాయి పల్లవి, కృతిశెట్టి కూడా వస్తున్నారు.



మొత్తానికి బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ తారలతో నిండిపోబోతుంది.