టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులను పూర్తి చేశాడు.

ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు.

ఐపీఎల్ 2025లో సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్.

17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20 క్రికెట్‌లో విరాట్ 13,000 పరుగులు పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ (67; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు.

కోహ్లీ కంటే ముందు నలుగురు క్రికెటర్లు మాత్రమే టీ20ల్లో 13 వేల రన్స్ పూర్తి చేశారు.

ముంబై ఇండియన్స్‌పై కోహ్లీ అత్యధిక స్కోరు 92*, ఇది 2018 ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో వచ్చింది.

కోహ్లీ యొక్క మొత్తం ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 132.00 కాగా, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లలో ఇది 126.0 .