ఐపీఎల్ 2025 సీజన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

అన్నీ జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

ఆటగాళ్ళు అదరగొట్టేస్తూ రికార్డులు నమోదు చేస్తున్నారు.

ఇక ప్రేక్షకులైతే మ్యాచ్ లను చూడటానికి స్టేడియం కి వెళుతున్నారు.

క్రికెట్ స్టేడియంలోని VIP డైమండ్ బాక్స్‌లో చాలా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.

ఎయిర్ కండీషన్డ్ లగ్జరీ బాక్స్ లో సమ్మర్ సీజన్ అయినా, సౌకర్యవంతమైన వాతావరణం ఉంటుంది.

మ్యాచ్ చూడటం కోసం ప్రత్యేక బాల్కనీ ఉంటుంది, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది.

ఉచిత హై-స్పీడ్ వైఫై ఉంటుంది, అలాగే గ్రాండ్ స్క్రీన్‌లపై ప్రత్యక్ష ప్రసారం కూడా

ఇక్కడ క్రికెట్ లెజెండ్స్, సెలెబ్రిటీలతో ప్రత్యక్షంగా కలవడానికి అవకాశం ఉంటుంది.

VIP మెంబర్ల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది.