‘జబర్దస్త్’ షోతో ఆకట్టుకున్న యాంకర్ అనసూయ, ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. భద్రుక కాలేజ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత అనసూయ ఓ టీవీ చానెల్‌లో న్యూస్ యాంకర్‌గా పని చేసింది. 2010లో అనసూయ ‘వేదం’ సినిమాలో దీక్షా సేత్‌కు డబ్బింగ్ చెప్పింది. ‘పైసా’ సినిమాలో సిద్ధికా శర్మకు కూడా అనసూయ డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత పెద్ద చిత్రాల్లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా అనసూయ ఆసక్తి చూపలేదు. ఈ రంగంలోకి రాక ముందే అనసూయ ఎన్టీఆర్ చిత్రం ‘నాగ’లో చిన్న పాత్రలో కనిపించింది. అనసూయకు 2010లోనే సుశాంక్ భరధ్వాజ్‌తో పెళ్లయ్యింది. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్. 2013లో ‘జబర్దస్త్’ యాంకర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఈ షో ఆమె జీవితాన్నే మార్చేసింది. 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయన’లో ప్రత్యేక గీతం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’ సినిమాలో ఏసీబీ జయ భరద్వాజ్‌గా పూర్తి నిడివి గల పాత్రలో నటించింది. ‘రంగ స్థలం’లో రంగమత్తగా, ‘పుష్ప’లో దాక్షాయణిగా నటించింది. తాజాగా ‘ఖిలాడి’ సినిమాలో కూడా అనసూయ తన గ్లామర్‌తో కుర్రాళ్ల మతి పోగెట్టింది. Images and Videos Credit: Anasuya Bharadwaj/Instagram