ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం కెనడా. అందులో విచిత్రమైన పేర్లు ఉన్న వీధులు ఉన్నాయి.
Ha ha Creek Road జనరల్లీ హా హా అని మనం నవ్వుతున్నప్పుడు ఈ పదాన్ని వాడతాం. పేరులో హా హా అని నవ్వుతున్నా.. జర్నీలో కనిపించదు.
విక్టరీ లేన్ అంటే కేవలం విజయం సాధించిన వాళ్లే ఈ రోడ్ లో ట్రావెల్ చేయాలా ఏంటి..? ఏమో ఆ పేరు పెట్టినవాడికే తెలియాలి.
ఈజీ స్ట్రీట్ లైఫ్‌లో ఈజీగా ఏదీ రాదు అని మనకు పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. కానీ ఆ ఫీలింగ్ పోగొట్టడానికి ఏమో...ఈజీ స్ట్రీట్ అని ఒకదానికి పేరు పెట్టేశారు కెనడియన్స్.
Road to nowhere ఈ రోడ్డుపై వెళ్తే ఎక్కడికీ చేరుకోము అని అర్థం. అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయిరా బాబూ అనిపిస్తోంది కదా... అదే మ్యాజిక్కు
The Tragically hip way ట్రాజిక్ అంటే తెలుసుగా విపరీతమైన బాధ అని అర్థం.అలాంటి బాధను దూరం చేసుకోవడానికి ఈ మార్గంలో Long Drive కి వెళ్లొచ్చు అని ఈ పేరు పెట్టారేమో?
పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి వెరైటీ పేర్లు కామన్‌గా కనిపిస్తూనే ఉంటాయి.