మాజీ భారత జట్టు కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అనారోగ్యంతో మరణించారు.

దీంతో ఆయన కుటుంబం, క్రికెట్ ప్రపంచం షాక్‌లో మునిగిపోయింది.

బిషన్ సింగ్ బేడీ (77) ఎంతో కాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

1946 సెప్టెంబర్ 25వ తేదీన బిషన్ సింగ్ బేడీ అమృత్‌సర్‌లో జన్మించారు.

1966 నుంచి 1979 వరకు బిషన్ సింగ్ బేడీ టీమ్ ఇండియాకు ఆడారు.

ఆయన 22 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు.

బిషన్ సింగ్ బేడీ భారత జట్టులోని స్పిన్ క్వార్టెట్‌లో ఒక భాగం.

ఈ స్పిన్ క్వార్టెట్ 1970ల్లో చాలా ప్రసిద్ధి చెందింది.

ఈ చతుష్టయంలో బిషన్ సింగ్ బేడీతో పాటు ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట్రాఘవన్ ఉన్నారు.