భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్ మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు.

మ్యాచ్ మొత్తం చూడాలంటే రోజువారీ డేటాలో లభించే 1.5 లేదా 2 జీబీ డేటాను మేనేజ్ చేసుకోవాలి.

కొన్ని టిప్స్ పాటించడం ద్వారా డేటాను స్మార్ట్‌గా వాడవచ్చు.

డేటా సేవర్ యాప్ ఉపయోగించడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ డేటా వినియోగం తగ్గుతుంది.

మనం ఉపయోగించే మొబైల్‌కు సరిపడా స్ట్రీమింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

మొబైల్ డేటా ద్వారా యాప్స్ ఆటో అప్‌డేట్‌ను తాత్కాలికంగా ఆపడం ఉత్తమం.

లేకపోతే యాప్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయి డేటా త్వరగా అయిపోతుంది.

సోషల్ మీడియా యాప్స్ స్క్రోలింగ్‌లో వీడియోలు ఆటో ప్లే ఆపేయండి.

లేకపోతే దీని వల్ల కూడా డేటా త్వరగా అయిపోయే అవకాశం ఉంది.