విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.

కానీ ఈ మ్యాచ్‌లో 15 పరుగులతో సెంచరీ మిస్ అయ్యాడు.

భారత్ తరఫున ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

వన్డే వరల్డ్ కప్‌లో 27 ఇన్నింగ్స్‌లో 48.47 సగటుతో 1115 పరుగులు చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌ల్లో 88.16 సగటుతో 529 పరుగులు చేశాడు.

అలాగే టీ20 వరల్డ్ కప్‌లో 27 మ్యాచ్‌ల్లో 1141 పరుగులు సాధించాడు.

మొత్తంగా 64 ఇన్నింగ్స్‌ల్లో 2785 పరుగులు చేశాడు.

సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్ కప్‌లో 2278 పరుగులు సాధించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో 441 పరుగులు చేశాడు.

ఐసీసీ టోర్నీల్లో 52.28 సగటుతో 2719 పరుగులు సాధించాడు.