డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే జూన్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాలి.
ఇక నుంచి డ్రైవింగ్ టెస్ట్ కి ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ లోనే టెస్ట్ ఇచ్చి సర్టిఫికెట్ పొందొచ్చు.
ఆ సర్టిఫికెట్ తీసుకుని ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి.
టూ వీలర్ కి, ఫోర్ వీలర్ కి వేర్వేరు డాక్యుమెంట్లు ఉంటాయి.
అధిక వేగంతో నడిపితే ఇక నుంచి రూ. 1000 - 2000 జరిమానా ఉంటుంది.
మైనర్ బండి నడిపితే.. రూ. 25వేలు ఫైన్. వెహికల్ ఓనర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్.
పట్టుబడ్డ మైనర్ కి 25 ఏళ్ల వరకు లైసెన్స్ ఇవ్వరు.
లెర్నర్ లైసెన్స్ రుసుము రూ. 200, రెన్యువల్ కి రూ. 200.
డ్రైవింగ్ టెస్ట్ కి రుసుము రూ.300.