పాక్​పై ఇండియా ప్రయోగించిన హామర్ మిసైల్ గురించి తెలుసా?

ఏప్రిల్ 22న పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.

భారత వైమానిక దళం పాకిస్తాన్, పోఓకేలోకి ప్రవేశించి ఉగ్రస్థావరాలపై విజృంభించింది.

ఈ చర్యల్లో భారత వైమానిక దళం హామర్, స్కాల్ప్ మిసైల్స్, రాఫెల్​లను ఉపయోగించింది.

ఈ దాడిలో వినియోగించిన హామర్ మిసైల్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.

హామర్​ మిసైల్​ను ఫ్రెంచ్​ కంపెనీ డెవలెప్ చేసింది. దీనితో గాలి నుంచి భూమికి నేరుగా టార్గెట్ చేయవచ్చు.

ఈ క్షిపణి పరిధి 20 నుంచి 70 కి.మీ ఉంటుంది. శత్రువులను సమర్థవంతంగా నాశనం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్, ఇనర్షియల్ నావిగేషన్ ద్వారా మార్గనిర్దేశం చేయవచ్చు.

వీటితో ఇండియా మొత్తం 9 పాక్ స్థావరాలపై దాడులు చేసింది.

బంకర్ భవనాలు, కమ్యూనికేషన్ సెంటర్ వంటి సురక్షితమైన లక్ష్యాలను ఈజీగా నాశనం చేయవచ్చు.

ఈ ఆపరేషన్​కు సింధూర్ అనే పేరు పెట్టింది ఇండియా.