ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్​లో చీనాబ్ వంతెనను ప్రారంభించి, దానికి పచ్చ జెండా ఊపారు.

Image Source: pti

ఈ వంతెనను చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన.

Image Source: pti

చినబ్ వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లు, దాని ఆర్చ్ 467 మీటర్లు.

Image Source: pti

ఈ వంతెనను గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, భూకంపాల వంటి విపత్తులను తట్టుకునేలా నిర్మించారు.

Image Source: pti

దృఢంగా, మన్నికతో ఉండేందుకు 28000 మెట్రిక్ టన్నుల ఉక్కుతో తయారు చేశారు.

Image Source: pti

ఈ వంతెన వల్ల కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలులో ప్రయాణం ద్వారా కేవలం 3 గంటల్లో చేరవచ్చు.

Image Source: pti

దీని ఎత్తు ఐఫిల్ టవర్ కంటే ఎక్కువ, కుతుబ్ మినార్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ.

Image Source: pti

USBRL ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించిన ఈ వంతెన కాశ్మీర్​ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది.

Image Source: pti

నిర్మాణంలో భాగంగా ఇండియాలో మొదటిసారిగా కేబుల్ క్రేన్ వ్యవస్థను ఉపయోగించారు. 915 మీటర్ల వెడల్పు గల లోయపై దీనిని నిర్మించారు.

Image Source: pti

ప్రధాని మోదీ దీనిని ఆధునిక భారతదేశ శక్తి, ఇంజనీరింగ్​కు చిహ్నంగా అభివర్ణించారు.

Image Source: pti