టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశను టీమిండియా భారీ విజయంతో ముగించింది.

ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

అనంతరం జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది.

దీంతో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది.

నవంబర్ 10వ తేదీన జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్: 25 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కేఎల్ రాహుల్ (51: 35 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు.

బౌలర్లలో అశ్విన్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి.

గ్రూప్-2లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది.
(All Images Credits: ICC)