వెస్టిండీస్‌తో థ్రిల్లింగ్‌గా సాగిన మొదటి వన్డేలో టీమిండియా మూడు పరుగులతో విజయం సాధించింది.



మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.



అనంతరం వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 305 పరుగులకే పరిమితం అయింది.

దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది.



భారత కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.



టీమిండియా తరఫున శిఖర్ ధావన్ (97) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.



శుభ్‌మన్ గిల్ (64), శ్రేయస్ అయ్యర్ (54) అర్థ సెంచరీలు సాధించారు.



వెస్టిండీస్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (75), బ్రాండన్ కింగ్ (54) అర్థ సెంచరీలు సాధించారు.



భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.



వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ రెండేసి, రొమారియో షెపర్డ్, అకెల్ హుస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.
(All Images Credits: BCCI)