కేఎల్‌ రాహుల్‌ 1 టెస్టు, 3 వన్డేల్లో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించాడు

కెప్టెన్‌ రాహుల్‌ టెస్టుల్లో 58, వన్డేల్లో 76 పరుగులు చేశాడు.

రాహుల్‌ సారథ్యంలో టీమ్‌ఇండియా ఆడిన 4 మ్యాచుల్లో ఓటమి పాలైంది.

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా సిరీసులో రాహుల్‌ కెప్టెన్సీ చేశాడు.

తాజాగా జింబాబ్వే సిరీసుకు రాహుల్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు.

ఫిట్‌నెస్‌ సాధించడంతో ధావన్‌ బదులు రాహుల్‌కు సారథ్యం అప్పగించారు.

మరి జింబాబ్వే సిరీసులోనైనా రాహుల్‌ తొలి విజయం అందుకుంటాడేమో చూడాలి.

ఆగస్టు 18, 20, 22న జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు ఆడుతుంది.

దక్షిణాఫ్రికా టీ20 సిరీసు నుంచి రాహుల్‌ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.

Image Source: PTI, Getty

జింబాబ్వే సిరీసులో రాహుల్‌ ఫామ్‌లోకి వస్తే ఆసియాకప్‌లో భారత్‌కు ఎదురుండదు.